అధ్యాత్మ సంకీర్తన
రేకు: 131-5
సంపుటము: 2-125
రేకు: 131-5
సంపుటము: 2-125
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| నానామార్గముల నాఁటుకొను నొకయోగి మానిమీఁది తపసి సామన్యుఁ డాయోగి | ॥పల్లవి॥ |
| పున్నమనమాసఁ గూడఁ బొదిగీ నొక్కొకయోగి కన్నులచూపులు సరిగాఁ దూఁచు నొకయోగి మిన్నునూయి చేఁతాటఁ జేఁది మెచ్చు మింగు నొకయోగి వెన్న సన్నముగ నూరి వీఁగు నొకయోగి | ॥నానా॥ |
| గాలి ముడియగఁ గట్టి కలుగుడిగట్టు యోగి నాలిమింటివిత్తు వెట్టి నగు నొకయోగి మూలనిధానము గని ముందు గానఁ డొకయోగి నేల దలకిందు సేసి నిక్కు నొకయోగి | ॥నానా॥ |
| గతజలములకెల్లఁ గట్టగట్టు నొకయోగి తతిఁ బూవులమాటల దడిగట్టు యోగి యితవైన శ్రీవేంకటేశుని మఱఁగు చొచ్చి గతిగనే నాతఁ డొక్కడే యోగి | ॥నానా॥ |


