అధ్యాత్మ సంకీర్తన
రేకు: 131-6
సంపుటము: 2-126
రేకు: 131-6
సంపుటము: 2-126
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| హరియే సకలక్రియలై తృప్తి యిచ్చుఁగాక యెరవులవారి చేఁతలెందాఁకా వచ్చీని | ॥పల్లవి॥ |
| నరులకు నరులే పరలోకక్రియలు సిరిమోహాచారాలఁ జేతురు గాక తరుపాషాణపశుతతుల కెవ్వరు సేసే- రరయఁగ భ్రమ గాక అవి పస్తులున్నవా | ॥హరి॥ |
| కొడుకులుగలవారు కోరి పితృముఖమున కుడుపులు దమవారిఁ గూర్చి పెట్టఁగా అడరి శ్రీహరియే అన్నియుఁ దాఁ జేకొని తడవి వారిఁ గొంత దయఁజూచుఁ గాక | ॥హరి॥ |
| తారేడ వారేడ దైవము శ్రీవేంకటేశుఁ- డారయ నంతరాత్ముఁ డని తెలిసి ధారతో యాతనియాజ్ఞఁ దప్ప కాదివసాన చేరువఁ జేసేవెల్లాఁ జేయుఁడీ యాతనికి | ॥హరి॥ |


