అధ్యాత్మ సంకీర్తన
రేకు: 132-2
సంపుటము: 2-128
రేకు: 132-2
సంపుటము: 2-128
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఏది వలసె నీవది సేయు యిందులోన నో జీవాత్మ పాదగు మనలో నంతరాత్మయై పరగిన శ్రీహరి పనుపునను | ॥పల్లవి॥ |
| మనవంటి జీవులే మహిలోన నొక కొన్ని శునకములై కుక్కుటములై సూకరములు నైనవి దినదినముఁ గర్మపాశములఁ దిరిగెడి దుర్దశ లటుచూడు సనకాదులై కొందరు జీవులు శౌరిదాసులై రటుచూడు | ॥ఏది॥ |
| కన్నులుఁ గాళ్ళు మనవలెఁ దనువులు గైకొని కొందరు నరులు పన్నిన తొత్తులు బంట్లునై మనపనులు సేయుచునున్నారు యెన్నఁగ శ్రీహరి నెఱఁగక యిడుములఁ బొరలెడి దది చూడు మున్నె హరిదాసులై నారదముఖ్యులు గెలిచిన దది చూడు | ॥ఏది॥ |
| యింతగాలమును యీపుట్టుగులనె యిటువలెఁ బొరలితి మిన్నాళ్ళు యింతట శ్రీవేంకటేశుఁడు దలంచి యీ జన్మంబున మము నేలె వింతల బొరలిన నరకకూపముల వెనకటి దైన్యములటు చూడు సంతసమున ముందరిమోక్షము సర్వానందంబది చూడు | ॥ఏది॥ |


