అధ్యాత్మ సంకీర్తన
రేకు: 132-3
సంపుటము: 2-129
రేకు: 132-3
సంపుటము: 2-129
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| నీవు సర్వసముడఁవు నీవు దేవదేవుఁడవు ఈవల నాగుణదోషాలెంచ నిఁక నేలా | ॥పల్లవి॥ |
| పూవులపైఁ గాసీఁ బొరి ముండ్లపైఁ గాసీని ఆవల వెన్నెలకేమి హానివచ్చీనా పావనుల నటు గాచి పాపపుంజమైన నన్నుఁ గావఁగా నీకృపకునుఁ గడమయ్యీనా | ॥నీవు॥ |
| గోపుమీఁద విసరీఁ గుక్కమీఁద విసరీని పావనపు గాలికిని పాపమంటీనా దేవతల రక్షించి దీనుఁడనైన నాకుఁ దోవచూపి రక్షించితే దోసమయ్యీనా | ॥నీవు॥ |
| కులజుని యింటనుండీ కులహీనుని యింటనుండీ యిలలో నెండకు నేమి హీనమయ్యీనా వలసి శ్రీవేంకటాద్రి వరములు యిచ్చి నాలో నిలిచి వరములిచ్చి నేఁడు గావవే | ॥నీవు॥ |


