అధ్యాత్మ సంకీర్తన
రేకు: 134-3
సంపుటము: 2-139
రేకు: 134-3
సంపుటము: 2-139
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| నిన్నూ నన్నూ నెంచుకోని నేరమి గాక పన్నిన సూర్యునికాంతి ప్రతిసూర్యుడౌనా | ॥పల్లవి॥ |
| జలధిలోపలి మీను జలధి దా నౌనా జలములాధారమైన జంతువు గాక నెలవై నీలోనివాడఁ నీవే నే నౌదునా పొలసి నీయ్యాధరువుబొమ్మ నింతే కాక | ॥నిన్నూ॥ |
| రాజువద్దనున్న బంటు రాజే తా నౌనా రాజసపు చనవరి రచనే కాక సాజమై నిన్నుఁ గొలిచి సరిగద్దె నుందునా వోజతో నిన్ను సేవించి వుందునింతే కాక | ॥నిన్నూ॥ |
| ము త్తెపుఁజిప్పల నీరు మున్నీటివలె నుండునా ముత్తెములై బలిసి లో మొనపుఁ గాక నిత్తెపు శ్రీవేంకటేశ నీశరణాగతులము మొత్తపు లోకుల మాముక్తులము గాక | ॥నిన్నూ॥ |


