అధ్యాత్మ సంకీర్తన
రేకు: 135-1
సంపుటము: 2-142
రేకు: 135-1
సంపుటము: 2-142
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| బిరుదులన్నియు నీవే బిరుదు లోకములెల్ల అరయ నీపాదమందె అణఁగుండెఁ గాన | ॥పల్లవి॥ |
| బహుదేవతాసార్వభౌమ బిరుదు నీకే సహజము నీవు భూసతిపతివి గాన వహి దేవతాచక్రవర్తి బిరుదు నీకే విహితము చక్రము చే వెలసేవు గాన | ॥బిరు॥ |
| పెను దేవశిఖామణి బిరుదు నీకే చెల్లు ఘన కౌస్తుభమణి గలవాఁడవు గాన మును దేవదేవోత్తముఁడను బిరుదు నీకే ననిచెఁ బురుషోత్తమనాముఁడవు గాన | ॥బిరు॥ |
| వొట్టుకొని దేవరాహుత్తరాయ బిరుదు నీదే కిట్టి రాతిగుఱ్ఱము నెక్కితివి గాన తిట్టమై శ్రీవేంకటేశదేవ సింహమవు నీవే అట్టె నారసింహుఁడవై అమరితి గాన | ॥బిరు॥ |


