అధ్యాత్మ సంకీర్తన
రేకు: 135-3
సంపుటము: 2-144
రేకు: 135-3
సంపుటము: 2-144
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| తలగరో లోకులు తడవకురో మమ్ము కలిగినదిది మా కాఁపురము | ॥పల్లవి॥ |
| నరహరికీర్తన నానిన జిహ్వ వొరుల నుతింపఁగ నోపదు జిహ్వ మురహరు పదములు మొక్కిన శిరము పరుల వందనకుఁ బరగదు శిరము | ॥తల॥ |
| శ్రీపతినే పూజించిన కరములు చోఁపి యాచనకుఁ జొరవు కరములు యేపున హరికడ కేఁగిన కాళ్ళు పాపుల యిండ్లకుఁ బారవు కాళ్ళు | ॥తల॥ |
| శ్రీవేంకటపతిఁ జింతించు మనసు దావతి నితరముఁ దలఁచదు మనసు దేవుఁడతని యాధీనపు తనువు తేవల నితరాధీనము గాదు | ॥తల॥ |


