అధ్యాత్మ సంకీర్తన
రేకు: 135-4
సంపుటము: 2-145
రేకు: 135-4
సంపుటము: 2-145
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఏల మమ్ము గాసిసేసే రింకా మీరు కాలముతో నిలిచేను కైవల్యపదవి | ॥పల్లవి॥ |
| పాపములు హరినామపఠనచేఁ బాపుకొంటి కైపుగఁ జిత్రగుప్తుఁ డాకవిలె గట్టు కోపులఁ బుణ్యములెల్ల గోవిందుని కిచ్చితిమి పూఁపల స్వర్గము త్రోవ భుజవేయరో | ॥ఏల॥ |
| అతుమలో నజ్ఞాన మాచార్యుఁడే పాపె ఆతల జన్మాల వాకిలటు ముయ్యరో చేత హరిదాస్యమున జీవన్ముక్తుఁడనైతి జాతి యధర్మములాల సంబంధము విడరో | ॥ఏల॥ |
| పరమాత్ము చింతచేత బదుకు నిశ్చయమాయ ధరఁ గైవసము గావో తగుచిత్తమా యిరవైన శ్రీవేంకటేశుఁ డేలుకొనె మమ్ము పరదేవతలు మాకుఁ బనిలేదు మీరు | ॥ఏల॥ |


