అధ్యాత్మ సంకీర్తన
రేకు: 136-1
సంపుటము: 2-148
రేకు: 136-1
సంపుటము: 2-148
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము నానార్థములు నిన్నే నడపె మాగురుఁడు | ॥పల్లవి॥ |
| అలరి దేహమనేటి యాగశాలలోన బలువై యజ్ఞానపు పశువు బంధించి కలసి వైరాగ్యపు కత్తులఁ గోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుఁడు | ॥జ్ఞాన॥ |
| మొక్కుచు వైష్ణవులనే మునిసభ గూడపెట్టి చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి చక్కఁగా సంకీర్తనసామగానము చేసి యిక్కువతో యజ్ఞము సేయించెఁబో మాగురుఁడు | ॥జ్ఞాన॥ |
| తదియ్యగురుప్రసాదపు పురోడాశ మిచ్చి కొదదీర ద్వయమను కుండంబులు వెట్టి యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె యెదివో స్వరూపదీక్ష యిచ్చెను మాగురుడు | ॥జ్ఞాన॥ |


