అధ్యాత్మ సంకీర్తన
రేకు: 136-2
సంపుటము: 2-149
రేకు: 136-2
సంపుటము: 2-149
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| లావణ్యశృంగారరాయ లక్ష్మీనాథ యేవేళ నీవినోదాన కేదాయ నేమి | ॥పల్లవి॥ |
| పాలజలధివంటిది పవ్వళించు నామనసు గాలివూర్పులే కడళ్లు కలదు లోఁతు చాలఁగ దొల్లి నీవు సముద్రశాయివట యీలీల నీవినోదాన కేదాయ నేమి | ॥లావ॥ |
| నిక్కపుభూమివంటిది నెలవుకో నామనసు పెక్కులిన్నియుఁ గలవు పెరుగుచుండు పుక్కటఁ దొల్లియు నీవు భూసతిమగఁడవట యెక్కువ నీవినోదాన కేదాయ నేమి | ॥లావ॥ |
| నిండుఁగొండవంటి దిదె నిలుచుండు నాభక్తి వుండుచోటనేవుండు నొక్కచోటను కొండలరాయఁడవట కోరికె శ్రీవేంకటేశ అండ నీవినోదాన కేదియాయ నేమి | ॥లావ॥ |


