అధ్యాత్మ సంకీర్తన
రేకు: 136-4
సంపుటము: 2-151
రేకు: 136-4
సంపుటము: 2-151
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| దినము ద్వాదశి నేఁడు తీర్థదివసము నీకు
జనకుఁడ అన్నమాచార్యుఁడ విచ్చేయవే | ॥పల్లవి॥ |
| అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘన నారదాది భాగవతులతో దనుజమర్దనుఁడైన దైవశిఖామణితోడ వెనుకొని యారగించ విచ్చేయవే | ॥దిన॥ |
| వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి శ్రీకాంతతోడనున్న శ్రీవేంకటేశుఁ గూడి యీకడ నారగించ నింటికి విచ్చేయవే | ॥దిన॥ |
| సంకీర్తనముతోడ సనకాదులెల్లఁ బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమినుండి లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుఁడు నీవు- నంకెల మాయింటి విందు లారగించవే | ॥దిన॥ |
| (ఈపాట అన్నమయ్య శ్రాద్ధ దినమును గూర్చివ్రాసినది
గాన, అన్నమయ్యరచన కాదు. అన్నమయ్యకీర్తనలరేకులలో నిది పొరపాటున చేరియుండవచ్చు.) |


