అధ్యాత్మ సంకీర్తన
రేకు: 138-2
సంపుటము: 2-161
రేకు: 138-2
సంపుటము: 2-161
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని పూరిజీవులము, నీవు పురుషోత్తముఁడవు | ॥పల్లవి॥ |
| అసురలు భువిఁ బుట్టుటది వుపకారమే అసురలు బాధింతు రమరులను పొసఁగ వారికిఁగాను పూనుకవచ్చి నీవు వసుధ జనించితేను వడి నిన్నుఁ గందుము | ॥ఊర॥ |
| అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు వెడఁగు మునులు విన్నవింతురు నీకు తడవి ధర్మము నిల్ప ధరణిఁ బుట్టుదు నీవు బడి నిన్ను సేవించి బ్రదుకుదు మపుడే | ॥ఊర॥ |
| నీకంటే మాకుఁ జూడ నీదాసులే మేలు పైకొని వారున్నచోటఁ బాయకుందువు చేకొని శ్రీవేంకటేశ చెప్పఁగానే వారిచేత నీకథలు విని విని నే మీడేరితిమి | ॥ఊర॥ |


