అధ్యాత్మ సంకీర్తన
రేకు: 138-3
సంపుటము: 2-162
రేకు: 138-3
సంపుటము: 2-162
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| పేరు నారాయణుఁడవు బెంబాడిచేఁతలు నీవి నోరు మూసుకున్నఁ బోదు నున్నని నీ సుద్దులు | ॥పల్లవి॥ |
| వేసులు మాకుఁ జెప్పె విన భారతముగాఁగ మోస నీపాలముచ్చిమి మొదలుగాను రాసికెక్క శుకుఁడు రవ్వగాఁ బొగడఁ జొచ్చె ఆసలఁ బరకాంతల నంటిన నీసుద్దులు | ॥పేరు॥ |
| రంతున వాల్మీకి చెప్పె రామాయణము గాను సంతగాఁ దాటకాదులఁ జంపినదెల్లా అంతకముందె నారదుఁడవి దండెమీటి చెప్పె యింతటా వేఁటాడి జీవహింసలు సేసినది | ॥పేరు॥ |
| వేడుక నజుఁడు చెప్పె వేదముగా నీవు దొల్లి వోడక మీనై కొన్నాళ్లుండితివంటా తోడనే సప్తరుషులు తొల్లియునుఁ జెప్పిరదె యీడనే శ్రీవేంకటాద్రి నిరవైతి వనుచు | ॥పేరు॥ |


