అధ్యాత్మ సంకీర్తన
రేకు: 138-6
సంపుటము: 2-165
రేకు: 138-6
సంపుటము: 2-165
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
| మీరు సాక్షి మీరు సాక్షి మే మేమీ ననలేము చేరి చూడరమ్మ వీని చెల్లుబడి యమ్మా | ॥పల్లవి॥ |
| పిన్నవాఁడు నిద్ర వోఁగ పెనచి కూఁకటతోడ పన్ని లేఁగతోఁకఁగూడ బంధించి కట్టె వున్నతిఁ దొలఁగ వాని వొళ్లెల్లా దోఁగిపోయ కన్నెలార యీకృష్ణుఁ గంటిరటరమ్మా | ॥మీరు॥ |
| లేఁగల నన్నిటి నేము లేవక తొల్లె విడిచె మూఁగి ఆవులుఁబేయలు మొగిఁ గలయ అఁగి పట్టఁబోతేను అప్పుడే తా గడె వెట్టి రాఁగతనాన నున్నాఁడు రాచబలువమ్మా | ॥మీరు॥ |
| వారము నేసేమనుచు వడి నింటివార మెల్లా కూరలు పాశాలు దొంతిఁ గూడఁబెట్టితే ఆరగించ వేలుపుల అలికి పూసి కుడిపీ కూరిమి శ్రీవేంకటాద్రి గోవిందుఁ డమ్మా | ॥మీరు॥ |


