అధ్యాత్మ సంకీర్తన
రేకు: 139-6
సంపుటము: 2-171
రేకు: 139-6
సంపుటము: 2-171
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఇదియే బుద్ధి నాకు నింతకంటే మఱిలేదు కదిసి నీబంటనంటే కాతువు నన్నును | ॥పల్లవి॥ |
| నేరచి నడచేనంటే నేఁ గాను స్వతంత్రుడఁను నేరమి చేసేనంటే నిండును దూరు యీరెంటికిఁ గాక నేను యిట్టె నీకు శరణంటే గారవించి వహించుక కాతువు నన్నును | ॥ఇది॥ |
| వొక్కచో నర్థ మర్జించుకుండితే జన్మాలు పెక్కు యెక్కేనంటే మోక్షము యేడో యెఱఁగ యెక్కడి సుద్దులునేల యిచ్చట నీనామము గక్కనఁ బేర్కొంటేఁ దయఁ గాతువుగా నన్నును | ॥ఇది॥ |
| తపసినయ్యేనంటేఁ జిత్తము కైవశము గాదు చపలసంసారినైతే శాంతి యుండదు ఉపమలేల శ్రీవేంకటోత్తమ నీసేవ చేసి కపటము మానితేను కాతువు నన్నును | ॥ఇది॥ |


