అధ్యాత్మ సంకీర్తన
రేకు: 140-1
సంపుటము: 2-172
రేకు: 140-1
సంపుటము: 2-172
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఆహా యేమి చేప్పేది హరి నీమాయ
మోహములే చిగిరించీ మొదల జవ్వనము | ॥పల్లవి॥ |
| యెంచఁగ భూమి యొక్కటే యేలినరాజు లెందరో
పొంచి వారివెంటవెంటఁ బోవదాయను అంచల సూర్యచంద్రులనే గడెకుడుకల ముంచి కొలచి పోసీని మునుకొని కాలము | ॥ఆహా॥ |
| దేవలోక మొక్కటే దేవేంద్రు లెందరో
కైవశమై యేలఁగ నొక్కరిదీ గాదు ఆవటించి పంచభూతాలనేటి శాఖలు వెళ్లి సావధానానఁ బెరిగీ సంసారవృక్షము | ॥ఆహా॥ |
| యిచ్చట నీ వొక్కఁడవే యిటు నీదాసు లెందరో
తచ్చి యెంత సేవించినాఁ దనివిలేదు నిచ్చలు శ్రీవేంకటేశ నిధానము నీభక్తి యెచ్చినాఁడ వింతటా నీడేరీ జన్మము | ॥ఆహా॥ |


