అధ్యాత్మ సంకీర్తన
రేకు: 140-4
సంపుటము: 2-175
రేకు: 140-4
సంపుటము: 2-175
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| అక్కటా నే నిర్మలుఁడనయ్యే దిఁక నెన్నఁడో చక్క నన్ను దిద్దుకోనే సర్వేశ్వరా | ॥పల్లవి॥ |
| నేనే మంచివాఁడనై తే నిండుకోదా జ్ఞానము కానీలే యింకా నేమేమి గడమో కాక ఆనుక సుకృతినైతే నలవడదా విర క్తి కానరాని తప్పు లెన్నిగలవో కాక | ॥అక్క॥ |
| నామనసే చక్కనైతే నాకుఁ బ్రత్యక్షము గావా చేముంచి నేరమేమి సేసితినో కాక ఆముక మోక్షాధికారినైతే నెదురుగా రాదా కామితార్థాలు భోగించఁ గలుగఁబోలుఁ గాక | ॥అక్క॥ |
| ఔలే నామేను పవిత్రమైతే సేవ గొనవా యేలాగున్నదో నీచిత్త మెఱఁగఁ గాక యీలీల శ్రీవేంకటేశ యెదుటనే వున్నాఁడవు యేలుకొని చేపట్టి యీడేర్చవు గాక | ॥అక్క॥ |


