అధ్యాత్మ సంకీర్తన
రేకు: 141-4
సంపుటము: 2-181
రేకు: 141-4
సంపుటము: 2-181
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| ఎంత కఠినమో హృదయ మిది చెంత ఱాతఁ జేసిరి గాఁబోలు | ॥పల్లవి॥ |
| అమరఁ బురాణములందు నరకముల- క్రమములు చదివియుఁ గలంగవు యమకింకరఘోరాకృతు లటు విని భ్రమసి యించుకా భయపడ నేను | ॥ఎంత॥ |
| మనుజుల దారుణమహితకర్మముల- అనుభవములు గని యలయను వొనర మహోగ్ర యహోరాత్రంబులు చనుచుండంగా జడియను నేను | ॥ఎంత॥ |
| కలుషరౌద్రదుఃఖముల కించుకా కలఁగను చీరికిఁ గైకొనను యెలమిని శ్రీవేంకటేశుఁడ నాపాలఁ గలిగి కాచితివి గాసిల నేను | ॥ఎంత॥ |


