అధ్యాత్మ సంకీర్తన
రేకు: 142-1
సంపుటము: 2-183
రేకు: 142-1
సంపుటము: 2-183
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| అందుకల్లా లోనుగాన అట్టే యెచ్చరికెతోడ పొందుగా హరిఁ దలఁచే పురుషుడే ఘనుఁడు | ॥పల్లవి॥ |
| చలములు పుట్టించ సారె మచ్చరము రేఁచ కలుగు నానావిధ కారణములు తలఁపులు భ్రమయించ తగువేడ్క లొనరించ పలుమా రెదుట నిల్చు బహురూపాలు | ॥అందు॥ |
| తగవులు దిద్దించ తగ నలమటఁ బెట్ట తగులు ననేకబంధములెల్లాను పగ సాధింపించ నప్పటి నుపాయాలు నేర్ప నిగిడివచ్చు ననేకనెపములెల్లాను | ॥అందు॥ |
| తేరకే మేనలయించ దేశమెల్లా నావటించ వూరకే తోఁచు ననేకవుద్యోగాలు కోరి శ్రీవేంకటేశ్వరుఁ గొలిచి నిశ్చింతుఁ డైతే ఆరయ మతిలో నిండు నానందాలు | ॥అందు॥ |


