Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 2-1
సంపుటము: 1-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
సదా సకలము సంపదలే
తుద దెలియఁగవలెఁ దొలఁగఁగవలయు
॥పల్లవి॥
అహర్నిశమును నాపదలే
సహించిన నవి సౌఖ్యములే
యిహమున నవి యిందఱికిని
మహిమ దెలియవలె మానఁగవలెను
॥సదా॥
దురంతము లివి దోషములే
పరంపర లివి బంధములు
విరసములౌ నరవిభవములౌ-
సిరులే మరులౌ చిరుసుఖ మవును
॥సదా॥
గతి యలమేల్ మంగ నాంచారికిఁ
బతియగువేంకటపతిఁ దలఁచి
రతు లెఱుఁగగవలె రవణము వలెను
హిత మెఱుఁగఁగవలె నిదె తనకు
॥సదా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము