అధ్యాత్మ సంకీర్తన
రేకు: 143-2
సంపుటము: 2-190
రేకు: 143-2
సంపుటము: 2-190
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| దైవమా నీపెరరేఁపణ లివి తప్పక వున్నవి జీవులకు భావించి కాదని దొబ్బి దీకొనఁగ బ్రహ్మాదులకైనను వసమా | ॥పల్లవి॥ |
| యెక్కడ సిద్ధించు బ్రహ్మచర్యము యెదుటనే కాంతలఁ జూచినవేళను చక్కఁగా మనోవ్యభిచారంబునఁ జలియించుం గాక చిక్కునే విరతి ధనధాన్యంబులు చేతికి లోనయినఁ జూచి వొక్కటియై తా నండే మగ్నమునొందించుం గాక | ॥దైవ॥ |
| కలుగునే తనివి బహుపదార్థములు గక్కన నంగళ్లనుఁ జూచి కొలఁదిమీఱఁ గడుతరితీపులతో కోరుచు నోరూరుం గాక వలనుగ సమాధి యెటువలె దొరకొను వాజవారణంబులఁ జూచి యెలమితోడ ముంగిళ్లనెల్లఁ జరియింపించుఁ గాక | ॥దైవ॥ |
| యేరీతి నెలకొను నీమీఁదితలఁపు యిహలోకపుసౌఖ్యము చూచి భారపు లంపటములు పై దగిలించి పనులకుఁ బురికొలుపుఁ గాక ధారుణి నే నివి గెలుచుట యెన్నఁడు తగ శ్రీవేంకటనాయక నీవే గారవించి రక్షింపుము నీ కిది కడునుపకారంబౌఁ గాక | ॥దైవ॥ |


