అధ్యాత్మ సంకీర్తన
రేకు: 143-5
సంపుటము: 2-193
రేకు: 143-5
సంపుటము: 2-193
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| ఇందరి బ్రదుకులును యీశ్వరుని చేతి దే యెందూ సుజ్ఞానులు నిన్నే యెఱిఁగి కొలిచిరి | ॥పల్లవి॥ |
| నినుఁ గనుఁగొనలేక నీచేఁత దెలియక మనుజులదృష్టమని మది నెంతురు అనిశము నీసృష్టి యిట్లని నిశ్చయించరాక తనరఁ గొందరు తమతమ కర్మ మందురు | ॥ఇంద॥ |
| మహి నీలీల లెంచక మహిమలు దెలియక బహుగతి జగత్తు స్వభావ మందురు నిహితమై నీ వింతటా నిండుకుండుట చూడక తహతహఁ గొందరు యింతా మిథ్య యందురు | ॥ఇంద॥ |
| భావములోన నిన్ను భావించ వసముగాక ఆవల నిరాకారమని యందురు శ్రీవేంకటేశ నీవు చేరి యెదుట నుండఁగా దేవుఁడు మనవాఁడుగా తెలిసితి మందురు | ॥ఇంద॥ |


