అధ్యాత్మ సంకీర్తన
రేకు: 144-1
సంపుటము: 2-194
రేకు: 144-1
సంపుటము: 2-194
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఏమని తలఁచవచ్చు నిటువంటి నీచి త్తము దీమసాన నీభావము తెలియ దెవ్వరికి | ॥పల్లవి॥ |
| రవిచంద్ర్రగ్రహ తారకములకుఁ దెరువు వివరించనున్నదా నీవే యాధారముగాక పవనునికి భువికి పదునాల్గులోకముల- కవల వేరొకచోట నాధార మున్నదా | ॥ఏమ॥ |
| తిలకింపఁ గులాచలదిగ్గజశేషాదులకు నిలువఁ జోటున్నదా నీవే యాధారము గాక నలుదిక్కులకు గగనమునకు మేఘాలకు కలది నీయాధారమే కాక వేర వున్నదా | ॥ఏమ॥ |
| అనంతబ్రహ్మాండముల కట్టే నీరూపములకు వెనకముందున్నదా నీవే యాధారముగాక వినుతి కెక్కిన శ్రీవేంకటేశ నీకు నీవే మనికైన యాధారము మఱి యెంచ నున్నదా | ॥ఏమ॥ |


