Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 144-3
సంపుటము: 2-196
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
సకలమైనవారికి సహజ మిది
అకటా యెట్టు గల్పించి ఆడించేవు దేవుఁడా
॥పల్లవి॥
తనియ కొరుల చక్కఁదనమే చూచుఁ గాని
తనభావము తనకుఁ దలఁపు గాదు
చొనిపి యౌవ్వనపుసుద్దులే చెప్పు గాని
పొనిఁగి తనవయసు పోవుట దెలియదు
॥సక॥
దారుణపాషాణబుద్ధులు దైవముపై బెట్టుఁ గాని
యీరీతినే తనదేహ మెంచుకొనఁడు
వూరిలోని మాటలెల్లా వుగ్గడించఁబోవుఁ గాని
కారణపు తన జన్మకథలు దడవఁడు
॥సక॥
వేడుకతో నిక్షేపాలు వెదకఁగోరుఁ గాని
ఆడనే ఆత్మనిక్షేప మది వొల్లఁడు
వీడక శ్రీవేంకటేశ వెలయ నీదాసులకు
తోడఁదోడఁ దెలుపుచు తోడయి రక్షింతువు
॥సక॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము