అధ్యాత్మ సంకీర్తన
రేకు: 144-5
సంపుటము: 2-198
రేకు: 144-5
సంపుటము: 2-198
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| వెలుపల వెదకితే వెస నాత్మఁ గనునా పలుమారు నిదే యభ్యాసము గావలెను | ॥పల్లవి॥ |
| యిన్ని చింతలు మఱచి యింద్రియాలఁ గుదియించి పన్నివుండిన హృదయపద్మమందును యెన్న నంగుష్ఠమాత్రపు టీశ్వరుపాదాల క్రింద తన్ను నణుమాత్రముగఁ దలఁచఁగవలెను | ॥వెలు॥ |
| పలుదేహపుఁ గాళ్లఁ బరువులు వారక బలుదేహపు టింటిలోపల చొచ్చి చలివేఁడిఁ బొరలక సర్వేశుపాదాల క్రింద తలకొన్న తన్నుఁ దానె తలఁచఁగవలెను | ॥వెలు॥ |
| కైకొన్న భక్తితో నిక్కపు శరణాగతితో చేకొని విన్నపములు చేసుకొంటాను యేకాంతాన శ్రీవేంకటేశ్వరు పాదాల క్రింద దాకొని తన్నుఁ దానే తలఁచఁగవలెను | ॥వెలు॥ |


