అధ్యాత్మ సంకీర్తన
రేకు: 145-3
సంపుటము: 2-202
రేకు: 145-3
సంపుటము: 2-202
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని వున్నవాఁడ నిఁక వేరే ఉపాయ మేమిటికి | ॥పల్లవి॥ |
| గతియై రక్షింతువో కాక రక్షించవోయని మతిలోని సంశయము మఱి విడిచి యితరులచే ముందర నిఁక నెట్టౌదునోయని వెతతోడఁ దలఁచేటి వెఱపెల్లా విడిచి | ॥నిన్ను॥ |
| తిరమైన నీమహిమ తెలిసేవాఁడననే- గరువముతోడి వుద్యోగము విడిచి వెరవున నీరూప వెదకి కానలేననే- గరిమ నలపు నాస్తికత్వమును విడిచి | ॥నిన్ను॥ |
| ధ్రువమైన నాచేఁతకు తోడు దెచ్చుకొనేననే అవల నన్యులమీఁది యాస విడిచి వివరిం చలమేల్మంగవిభుఁడ శ్రీవేంకటేశ తవిలితి నాపుణ్యమంతయు నీకు విడిచి | ॥నిన్ను॥ |


