అధ్యాత్మ సంకీర్తన
రేకు: 145-5
సంపుటము: 2-204
రేకు: 145-5
సంపుటము: 2-204
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| దైవము తోడిదే తన తగులు జీవుడిఁది యెఱిఁగితే చిక్కనీదు తగులు | ॥పల్లవి॥ |
| కన్నులఁ జూచినంతనే కలుగునుఁ దగులు మిన్నక మాటలాడితే మిగులాఁ దగులు పన్నుగా నవ్వితేను పాదుకొనుఁ దగులు యెన్నైనా నూరకుండితే నేమీ లేదు తగులు | ॥దైవ॥ |
| వీనులొగ్గి వినఁబోతే విశ్వమెల్లాఁ దగులు ఆనుక సహవాసాన నంటుకొనుఁ దగులు పూని లోకుల పొందుల పొదిగొను తగులు మోనాన నూరకుండితే మొగియదు తగులు | ॥దైవ॥ |
| కరుణించి యేమిచ్చినా గట్టియవునుఁ దగులు దొరతనాన మించితే తొడరును తగులు ధరణి శ్రీవేంకటేశుఁ దలఁచి యేకాంతాన- నిరవై వూరకుండితే నెనయదు తగులు | ॥దైవ॥ |


