అధ్యాత్మ సంకీర్తన
రేకు: 145-6
సంపుటము: 2-205
రేకు: 145-6
సంపుటము: 2-205
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇందరూ జీవులే యెంచి చూచితే- నందులో భావము లవియే వేరు | ॥పల్లవి॥ |
| అంతటఁ జూచిన యాహారనిద్రలు జంతురాసులకు సహజములు సంతోషంబును సాత్వికగుణమును శాంతచిత్తులకు సహజములు | ॥ఇంద॥ |
| మనసునఁగల కామక్రోధంబులు జననశీలులకు సహజములు వినయంబును ఘనవిజ్ఞానము స- జ్జనుల కెపుడును సహజములు | ॥ఇంద॥ |
| విడువని యాసలు వేవేలు చింతలు జడులకు నం(నెం ?) దును సహజములు బడి శ్రీవేంకటపతి కొలువుఁ దపము జడియని దాసుల సహజములు | ॥ఇంద॥ |


