అధ్యాత్మ సంకీర్తన
రేకు: 146-1
సంపుటము: 2-206
రేకు: 146-1
సంపుటము: 2-206
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| కలది యీమూర్తివల్ల గతి గనవలెను యిల నిందు నమ్మకుంటే యెందు మరి లేదు | ॥పల్లవి॥ |
| కంటిమా బ్రహ్మమును వేంకటపతిఁ గనినట్టు కంటిమా అవతారాలు కతలె కాక కంటిమా హృదయములోఁ గలిగిన దైవమును కంటిమా వైకుంఠముకడవారైనాను | ॥కల॥ |
| తెలిసీనా జ్ఞానము యీదేవుని మహిమవలె తెలిసీనా వేదాలు సందేహమే కాక తెలిసీనా మాయ యిది యెంత చదివినా తెలిసీనా ముందరితెరువు వెదకితే | ॥కల॥ |
| చిక్కీనా మనసు యీశ్రీవేంకటేశ్వరువలె చిక్కీనా ధ్యానము వట్టిచింతలేకాక చిక్కీనా అనాదినుండి చిగిరించీ కాలము చిక్కీనా పెద్దలు చెప్పే జితమైన శాంతి | ॥కల॥ |


