Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 147-4
సంపుటము: 2-214
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
దేవ నే నీయాధీనము దిక్కు దెస నాకు నీవే
సేవ సేయకుండినా రక్షించ నీకు భారము
॥పల్లవి॥
ఆడివచ్చిన బిడ్డని నపరాధిఁ జేసి తల్లి
వోడక యన్నము పెట్టకుండవచ్చునా
వేడుకకాఁడు చిల్కకు వింతమాటలెల్లా నేర్పి
ఆడినట్టే యాడితేను అదలించవచ్చునా
॥దేవ॥
చిక్కినావు తొడుకుమేసి వచ్చేనంటా గొల్లఁడు
దుక్కక కావక పోఁదోలవచ్చునా
యెక్కే గుఱ్ఱము గోళిగె నెనసి పైకొంటే రౌతు
తక్కక దానిఁ జీకటితప్పు గొనవచ్చునా
॥దేవ॥
పతిఁ బెండ్లాడిన యాలు పక్కనుండి నిద్రించితే
కొతికి కాలానుభాగి గొనవచ్చునా ?
తతి నేఁపనికి రాక తామసుఁడై వుండినా
గతియై శ్రీవేంకటేశ కావకుండవచ్చునా
॥దేవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము