అధ్యాత్మ సంకీర్తన
రేకు: 147-5
సంపుటము: 2-215
రేకు: 147-5
సంపుటము: 2-215
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు సేసితి తటుకన నీవనే నిధానము చేకొంటిని | ॥పల్లవి॥ |
| కామించితి నాత్మ నిన్నుఁ గలసి భోగించుటకు వేమరుఁ గ్రోధించితి నీవిరోధులపై నేమమున లోభించితి నీమంత్రమన్యుల కియ్య ఆముకొని మోహించితి హరి నీరూపునకు | ॥ఇటు॥ |
| యెఱుకతో మదించితి యిట్టే నీదాస్యమున మఱి నిన్నొల్లని చదువు మచ్చరించితి తఱిఁ జలపట్టితి నీతప్పని భ క్తియందు వెఱవక నిన్నొల్లని విధుల నిందించితి | ॥ఇటు॥ |
| కల కర్మములెల్లా నీకైంకర్యములందు వెట్టితి బలు మమకారము నీపైఁ జేర్చితిఁ యెలిమి శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి నిలిచిన కాలమెల్లా నీసేవే చేసితి | ॥ఇటు॥ |


