అధ్యాత్మ సంకీర్తన
రేకు: 148-2
సంపుటము: 2-218
రేకు: 148-2
సంపుటము: 2-218
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| ఇతఁడు రామునిబంటు యితని కెవ్వ రెదురు చతురత మెరసె నిచ్చట హనుమంతుఁడు | ॥పల్లవి॥ |
| అకాస (శ?) మంతయు నిండి యవ్వలికిఁ దోఁక చాఁచి పైకొని పాతాళానఁ బాదాలు మోపి కైకొని దశదిక్కులు కరములఁ గబళించి సాకారము చూపినాఁ డిచ్చట హనుమంతుఁడు | ॥ఇతఁ॥ |
| కొంచక సురలు రోమకూపముల విహరించ ముంచి ధ్రువమండలము మొగమై యుండ యెంచఁగ లోకములెల్లా యెడనెడ సందులుగా చంచుల మెరసినాఁ డిచ్చట హనుమంతుఁడు | ॥ఇతఁ॥ |
| గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరువు కటితటము గాఁగా ఇరవుగా శ్రీవేంకటేశుని సేవకుఁడై బెరసె నిచ్చట నిదె పెద్ద హనుమంతుఁడు | ॥ఇతఁ॥ |


