అధ్యాత్మ సంకీర్తన
రేకు: 148-3
సంపుటము: 2-219
రేకు: 148-3
సంపుటము: 2-219
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| రాముఁడు లోకాభిరాముఁడు త్రైలోక్య- ధాముఁడు రణరంగభీముఁడు వాఁడె | ॥పల్లవి॥ |
| వరుఁడు సీతకు ఫలాధరుఁడు మహోగ్రపు- శరుఁడు రాక్షససంహరుడు వాఁడే స్థిరుఁడు సర్వగుణాకరుఁడు కోదండదీక్షా- గురుఁడు సేవకశుభకరుఁడు వాఁడే | ॥రాముఁ॥ |
| ధీరుఁడు లోకైకవీరుఁడు సకలా- ధారుఁడు భవబంధదూరుఁడు వాఁడే శూరుఁడు ధర్మవిచారుఁడు రఘువంశ- సారుఁడు బ్రహ్మసాకారుఁడు వాఁడే | ॥రాముఁ॥ |
| బలుఁడు యిన్నిటా రవికులుఁడు భావించ ని- ర్మలుఁడు నిశ్చలుఁ డవికలుఁడు వాఁడే వెలసి శ్రీవేంకటాద్రి విజనగరములోన తలకొనెఁ బుణ్యపాదతలుఁడు వాఁడే | ॥రాముఁ॥ |


