అధ్యాత్మ సంకీర్తన
రేకు: 148-4
సంపుటము: 2-220
సంస్కృతకీర్తన
రేకు: 148-4
సంపుటము: 2-220
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| శరణు శరణు విభీషణవరదా శరధిబంధన రామ సర్వగుణస్తోమ | ॥పల్లవి॥ |
| మారీచసుబాహుమదమర్దన తాటకాహర క్రూరేంద్రజిత్తులగుండుగండా దారుణకుంభకర్ణ దనుజ శిరచ్ఛేదక వీరప్రతాప రామ విజయాభిరామ | ॥శర॥ |
| వాలినిగ్రహ సుగ్రీవరాజ్యస్థాపక లాలితవానరబల లంకాపహార పాలితసవనాహల్యపాపవిమోచక పౌలస్త్యహరణ రామ బహుదివ్యనామ | ॥శర॥ |
| శంకరచాపభంజక జానకీమనోహర పంకజాక్ష సాకేతపట్టాణాధీశ అంకితబిరుద శ్రీవేంకటాద్రినివాస ఓంకారరూప రామ పురుసత్యకామ | ॥శర॥ |


