Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 148-5
సంపుటము: 2-221
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
శ్రీవేంకటేశ్వరుని సింగారము వర్ణించితే
యే విధానఁ దలఁచినా యిన్నిటికిఁ దగును
॥పల్లవి॥
కరిరాజుఁ గాచిన చక్రమువట్టిన హస్తము
కరితుండమని చెప్పఁగా నమరును
వరములిచ్చేయట్టి వరదహస్తము కల్ప-
తరుశాకయని పోల్పఁదగు నీకును
॥శ్రీవేం॥
జలధిఁ బుట్టిన పాంచజన్యహస్తము నీకు
జలధితరఁగయని చాటవచ్చును
బలుకాళింగుని తోఁకపట్టిన కటిహస్తము
పొలుపై ఫణీంద్రుడని పొగడఁగఁదగును
॥శ్రీవేం॥
నలినహస్తంబుల నడుమనున్న నీయుర-
మలమేలుమంగ కిరవఁదగును
బలు శ్రీవేంకటగిరిపై నెలకొన్న నిన్ను-
నలసి శ్రీవేంకటేశుఁ డనదగును
॥శ్రీవేం ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము