అధ్యాత్మ సంకీర్తన
రేకు: 148-6
సంపుటము: 2-222
రేకు: 148-6
సంపుటము: 2-222
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| పంట వండుకొనేవారిభాగ్యము లిటమీఁద- నంటిముట్టి వెదకితే నాతుమ లోనున్నది | ॥పల్లవి॥ |
| వేదములలో మొలచె వేదాంతాలఁ గొనసాగె గాదిలి శ్రీహరిభక్తికల్పలత పోదియెక్కె వై రాగ్యబోధలచేఁ బలుమారు పాదుకొని వేరువారె పంచసంస్కారాలను | ॥పంట॥ |
| అల్లుకొనె మునులలో నంటెనుఁ బురాణాల చెల్లుబడి శాస్త్రాలఁ జిగిరించెను చల్లఁగాఁ బూవులు వూచె సత్కర్మవిదులను మెల్లనే నీడలు నిండె మించి సుజ్ఞానమున | ॥పంట॥ |
| పరమయోగములఁ బూఁపలుఁ బిందెలు వుట్టె పరగె సురలనే పందిటియందు యిరవై శ్రీవేంకటేశుఁ డిందుకు ఫలమైనాఁడు గురుసేవలను దొరకును వివేకులకు | ॥పంట॥ |


