అధ్యాత్మ సంకీర్తన
రేకు: 149-3
సంపుటము: 2-225
రేకు: 149-3
సంపుటము: 2-225
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఇహపరసాధన మీ తలఁపు సహజజ్ఞానికి సత మీ తలఁపు | ॥పల్లవి॥ |
| సిరులు ముంగిటను జిగిఁ దడఁబడఁగా హరిని మఱువనిది యది దలఁపు సరిఁ గాంతలెదుట సందడిగొనఁగా తిరమయి భ్రమయనిదే తలఁపు | ॥ఇహ॥ |
| వొడలి వయోమద ముప్పతిల్లినను అడఁచి మెలుగుట యది దలఁపు కడఁగుచు సుఖదుఃఖములు ముంచినను జడియని నామస్మరణమే తలఁపు | ॥ఇహ॥ |
| మతి సంసారపుమాయ గప్పినను అతికాంక్షఁ జొరనిదది తలఁపు గతియై శ్రీవేంకటపతి గాచిన సతతము నితనిశరణమే తలఁపు | ॥ఇహ॥ |


