అధ్యాత్మ సంకీర్తన
రేకు: 150-2
సంపుటము: 2-230
రేకు: 150-2
సంపుటము: 2-230
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| భోగించఁ బుట్టిన సొమ్ము పొంచి పరాన కేలోపు శ్రీగురుఁడ నీవే దయసేతువు గాని | ॥పల్లవి॥ |
| యీరెండుచేతులే యిన్ని పాపాలకు నోపు వూరకే పుణ్యము సేయనోపవు గాని మారుకొ నీరెండుగాళ్లే మాపుదాఁకాఁ జుట్టనోపు యేరీతి దేవ నీగుడి కేఁగ నలసుఁ గాని | ॥భోగిం॥ |
| కన్ను లివి రెండే మిన్నుగలంతాఁ జూడనోపు ఉన్నతి నాసాగ్రదృష్టి కోపవు గాని అన్నిటా రెండుపెదవు లధరామృతాన కోపు సన్నల మోక్షముత్రోవ జపించవు గాని | ॥భోగిం॥ |
| యీవీనులు రెండే విశ్వమంతా నాలించనోపు వోవల శాస్త్రాలకైతే నోపవు గాని శ్రీవేంకటేశ నీవే చిత్తాన జ్ఞానమిచ్చితే భావించి జీవుఁడిన్నిటా బ్రదుకనోపుఁ గాని | ॥భోగిం॥ |


