అధ్యాత్మ సంకీర్తన
రేకు: 150-4
సంపుటము: 2-232
రేకు: 150-4
సంపుటము: 2-232
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| పరమాత్ముఁడు సర్వపరిపూర్ణుఁడు సురలకు నరులకు చోటయి యున్నాఁడు | ॥పల్లవి॥ |
| కన్నులఁ గంటానే కడు మాటలాడుతానే తన్నుఁగానివానివలె దాఁగియున్నాఁడు అన్నియు వింటానే అట్టే వాసన గొంటానే వన్నెలనూనె కుంచమువలె నున్నాడు | ॥పర॥ |
| తనువులు మోచియు తలఁపులు దెలిసియు యెనసియు నెనయక యిట్లున్నాఁడు చెనకి మాయకు మాయై జీవునికి జీవమై మొనసి పూసలదారమువలె నున్నాఁడు | ॥పర॥ |
| వేవేలు విధములై విశ్వమెల్లా నొకటై పూవులు వాసనవలె బొంచియున్నాఁడు భావించ నిరాకారమై పట్టితే సాకారమై శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతై యున్నాఁడు | ॥పర॥ |


