అధ్యాత్మ సంకీర్తన
రేకు: 150-6
సంపుటము: 2-234
రేకు: 150-6
సంపుటము: 2-234
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇట్లానే యోగలక్ష్య మెఱుఁగుకొంటే ఫలించు యెట్టయినా గురువాక్య మేమరకుఁడీ | ॥పల్లవి॥ |
| కాంతఁ దలచుకొంటేనే కామోద్రేకము వుట్టు యింతలోఁ గూడెనా యేడకేడ సూత్రము చింతకాయతొక్కు చూచితేనే నోరూరు యెంతకెంతదవ్వు యేడకేడ సూత్రము | ॥ఇట్లా॥ |
| వీనుల మంచిమాటలు వింటేనే సంతోష ముబ్బు యేనిజము గనె నేడకేడ సూత్రము ఆనించితే నాలుకనే ఆరురుచులుఁ దెలిసీ యీనెపమున నేడకేడ సూత్రము | ॥ఇట్లా॥ |
| ముక్కుకొనఁ బ్రాణ ముండి ముందువెనుకకు వచ్చి యెక్కడ మోచున్న దేడకేడ సూత్రము చిక్కి శ్రీవేంకటేశుఁడు జీవుల కంతర్యామి యిక్కు వెఱిఁగితే నీడ కిదే సూత్రము | ॥ఇట్లా॥ |


