అధ్యాత్మ సంకీర్తన
రేకు: 151-5
సంపుటము: 2-239
రేకు: 151-5
సంపుటము: 2-239
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| దిక్కులు సాధించఁబూని దేవదుందుభులు మ్రోయ యెక్కువతో శ్రీవేంకటేశుఁ డెక్కెఁ దేరు | ॥పల్లవి॥ |
| పన్నిద్దరు సూరియుల బండికండ్లతేరు సన్నుతి శేషాదిదేవాసనపుఁ దేరు కన్నులపండుగైన గరుడధ్వజపుఁ దేరు యెన్నఁగ శ్రీవేంకటేశుఁ డెక్కె నిదె తేరు | ॥దిక్కు॥ |
| మించు నానా మేఘముల మేలుకట్ల తేరు చుంచులనక్షత్రాల కుచ్చుల తేరు అంచెదేవతలే బొమ్మలై వుండినట్టి తేరు యెంచఁగ శ్రీవేంకటేశుఁ డెక్కె నిదె తీరు | ॥దిక్కు॥ |
| అట్టె కిం దేడులోకము లంతరువులైన తేరు నట్టనడుమను బ్రహ్మాండపు తేరు దిట్ట యలమేల్మంగతోఁ దిరమైవుండేటి తేరు యిట్టె శ్రీవేంకటేశుఁ డెక్కె నిదె తేరు | ॥దిక్కు॥ |


