అధ్యాత్మ సంకీర్తన
రేకు: 152-2
సంపుటము: 2-241
రేకు: 152-2
సంపుటము: 2-241
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
| దేవుఁడొక్కఁడే గురి దెలిసినవారికి యీవలావల చూచినా నిఁకలేదు తెఱఁగు | ॥పల్లవి॥ |
| కోపము మానితేనే కోటిజపాలు సేయుట పాపము సేయకుంటేనే బలుతపము లోపల తానూరకుంటే లోకమెల్లాఁ జరించుట మాపుదాఁకా వెదకినా మఱిలేదు తెఱఁగు | ॥దేవుఁ॥ |
| పరకాంత నంటకుంటె బలుపుణ్యాలు సేయుట సొరిది నాసమానుటే సోమపానము సరిమోనాన నుండుటే సన్యాసము చేకొనుట యిరవైతే నంతకంటే నిఁకలేదు తెఱఁగు | ॥దేవుఁ॥ |
| పలు సుఖదుఃఖములఁ బాసి వుండుటే మోక్షము అల చంచలము మానుటది యోగము యిలపై శ్రీవేంకటేశుఁ డిచ్చిన సుజ్ఞానమిది యెలమి బుద్ధిఁ బోల నిఁకలేదు తెఱఁగు | ॥దేవుఁ॥ |


