అధ్యాత్మ సంకీర్తన
రేకు: 152-3
సంపుటము: 2-242
రేకు: 152-3
సంపుటము: 2-242
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్రం
| తలఁచుకో వో మనస తగిన ద్రిష్టము లివి వెలలేక తెచ్చేటి వివేకము లోధనము | ॥పల్లవి॥ |
| గాలిఁబోయేఁ మాటలు లోకములోని సుద్దులెల్లా గాలిఁ బో వెన్నఁడును శ్రీకాంతునుతులు జాలిఁబడే సేఁతలుసంసారభోగములెల్లా జాలిలేనివి విష్ణుని సంతతపుపూజలు | ॥తలఁ॥ |
| మాయమౌ గొన్నాళ్లకు మానుషకృత్యములెల్లా మాయముగానివి దైవికమహిమలెల్లా కాయకములే తమ కల్పితము లన్నియును కాయకము గాక నిల్చుఁ గమలాక్షు మన్నన | ॥తలఁ॥ |
| వుడివోవు రాఁగారాఁగా నున్నతకర్మఫలాలు వుడివోదు దేవునిపై నొనరు భక్తి జడియ నితరులిచ్చేసకల వరములును జడియదు శ్రీవేంకటేశ్వరుఁడిచ్చే వరము | ॥తలఁ॥ |


