అధ్యాత్మ సంకీర్తన
రేకు: 152-4
సంపుటము: 2-243
రేకు: 152-4
సంపుటము: 2-243
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| అహోబలేశ్వరునకు నాదిమూర్తికి విహారమే పంతము వీరసింహమునకు | ॥పల్లవి॥ |
| చుక్కలు మొలపూసలు సూర్యచంద్రులు కన్నులు దిక్కులు చేతు లెండలు దివ్యాయుధాలు మిక్కుటపు వేదములు మించుఁగొస వెంట్రుకలు రక్కసులఁ జెండే విదారణసింహమునకు | ॥అహో॥ |
| శై లములే పాదములు జానువులే లోకములు కాలచక్రమే నోరు గ్రహాలు పండ్లు చాలుకొన్న మేఘములు సకలదివ్యాంబరాలు పాలించే ప్రతాపపుసింహమునకు | ॥అహో॥ |
| అంతరిక్షమే నడుము అట్టె భూమియే పిరుఁదు వంతఁ గృపారసము వార్ధులెల్లాను యింతటా శ్రీవేంకటాద్రి యిరవు మహాగుహ రంతు లురుములు ఘోరరౌద్రసింహమునకు | ॥అహో॥ |


