అధ్యాత్మ సంకీర్తన
రేకు: 153-5
సంపుటము: 2-250
రేకు: 153-5
సంపుటము: 2-250
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| మగటిమిగల హనుమంతరాయ దిగువపట్టణములోని దేవ హనుమంత | ॥పల్లవి॥ |
| చక్కఁగాఁ దోఁక చాఁచి జంగవెట్టి చేచాఁచి అక్కజపు ప్రతాపపు హనుమంతుఁడా రక్కసులఁ దునుమాడి రాముని దేవులకు దిక్కై వుంగరమిచ్చిన దేవ హనుమంత | ॥మగ॥ |
| కీలుగంటు వేసుకొని కెరలి పిడికిలించి ఆలకించేవు దిక్కులు హనుమంతుఁడా నేలకు మింటికి మేను నిండఁ బెరిగి యక్షుని తీలు పడఁగొట్టినట్టి దేవ హనుమంతుఁడా | ॥మగ॥ |
| తమితోడ దాసులను తప్పక కాచేనని అమర నభయమిచ్చిన హనుమంతుఁడా జమళి శ్రీవేంకటేశు సరస వూడిగానకు తిమురుచు నుండేయట్టి దేవ హనుమంతా | ॥మగ॥ |


