అధ్యాత్మ సంకీర్తన
రేకు: 154-2
సంపుటము: 2-253
రేకు: 154-2
సంపుటము: 2-253
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఏకాత్మవాదులాల యిందు కేది వుత్తరము మీకు లోకవిరోధ మేమిటఁ బాసీ నయ్యలాల | ॥పల్లవి॥ |
| పాప మొక్కడు సేసితే పాపులే యిందరుఁ గావలదా యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా కోపంచి యొక్కఁ డసురైతే కోరి యిందరుఁ గావలదా చూప దేవుఁడొక్కఁడైతే సురలిందరుఁ గావలదా | ॥ఏకా॥ |
| వొకఁ డపవిత్రుఁ డైతే నొగి నిందరుఁ గావలదా వొకఁడు శుచై వుండితే వోడ కిందరుఁ గావలదా వొకని రతిసుఖమంటి యిందరును వొనరఁ బొందవలదా వొకని దుఃఖ మందరు వూరఁ బంచుకోవలదా | ॥ఏకా॥ |
| ఆకడ నొకఁడు ముక్తుఁడయితే నందరునుఁ గావలదా దీకొని యొకఁడు బంధుఁడయితే యిందరుఁ గావలదా చేకొని శ్రీవేంకటేశుఁ జేరి దాసులయి యుండేటి- లోకపు మునులనుఁ దెలుసుకోవలదా | ॥ఏకా॥ |


