అధ్యాత్మ సంకీర్తన
రేకు: 155-6
సంపుటము: 2-262
రేకు: 155-6
సంపుటము: 2-262
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా వింతలై న నీమూర్తి వెసఁ దెలిసేమా | ॥పల్లవి॥ |
| లోకములో సముద్రములోఁతు చెప్పఁగరాదట ఆకాశ మింతంతని యనరాదట మేకొని భూరేణువులు మితి వెట్టఁగరాదట శ్రీకాంతుఁడ నీమహిమ చెప్ప చూపవశమా | ॥ఎంత॥ |
| అల గాలి దెచ్చి ముడియగాఁ గట్టఁగరాదట వెలయఁ గాలము గంటు వేయరాదట కలయ నలుదిక్కులకడ గానఁగరాదట జలజాక్ష నీరూపు తలపోయఁగలనా | ॥ఎంత॥ |
| కేవలమైన నీమాయ గెలువనేరాదట భావించి మనఁసు జక్కఁ బట్టరాదట దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కొల్వవశమా | ॥ఎంత॥ |


