అధ్యాత్మ సంకీర్తన
రేకు: 156-4
సంపుటము: 2-266
రేకు: 156-4
సంపుటము: 2-266
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| కోటానఁగోట్లాయ కోరికెలు జన్మములు కూటువ గూడి రాట్నపుగుండ్ర లైనారయ్యా | ॥పల్లవి॥ |
| మిన్ను పైనున్న జీవులు మన్నుపైఁ బ్రవేశించి అన్నద్వారమున దేహము మోఁచి మున్నిటి దానఫలా లిమ్ముల భుజించి యప్పటి తిన్నని కర్మములు గాదెలఁ బోసేరయ్యా | ॥కోటా॥ |
| యిరవు మఱచి మఱి యెరవులకాఁపిరేల సురలు నరులమంటాఁ జొక్కిచొక్కి సొరిది లోకములెల్లాఁ జొచ్చి కాలగతులను పొరి నాయుష్యము గొల్చిపోయుచున్నారయ్యా | ॥కోటా॥ |
| దండగాఁగఁ దిరుమలకొండయెక్కి సుజ్ఞానులు పండిన మనసుతోడ బత్తినేసి అండనే శ్రీవేంకటేశు నలమేల్మంగనుఁ గొల్చి నిండునిధానములై నిల్చినారయ్యా | ॥కోటా॥ |


