అధ్యాత్మ సంకీర్తన
రేకు: 156-5
సంపుటము: 2-267
రేకు: 156-5
సంపుటము: 2-267
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| మొదలనే యెచ్చరికెతో మోసపోక యేపొద్దూ వెదకి హరికథలే వినుచుండవలయు | ॥పల్లవి॥ |
| వెలఁదుల సుద్దులు వీనులను వింటేను పెలుచుఁజూపులఁ జూడఁ బ్రేమ వుట్టించు మలసి యాచూపులు మనసునఁ దగిలించు తలఁపు మాటాలాడఁ దమిరేఁచును | ॥మొద॥ |
| మగువలతోడుత మాటలాడ దొరకొంటే నగినగి సంసారాలనంటు గల్పించు తగిలిన నవ్వులు తనువులు సోఁకింపించు మిగులాఁ దనుసోకులే మించి వలపించును | ॥మొద॥ |
| సతులతో మోహము సంపదలు పోరించు అతిసంపదలు దేహి నజ్ఞానిఁ జేయు తతి నలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడే గతియని కొలిచితే ఘనునిఁగా జేయును | ॥మొద॥ |


