అధ్యాత్మ సంకీర్తన
రేకు: 156-6
సంపుటము: 2-268
రేకు: 156-6
సంపుటము: 2-268
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఇందువల్ల నేమిగద్దు యినుపగుగ్గిళ్లింతే యిందిరారమణు సేవే యిరవైన పదవి | ॥పల్లవి॥ |
| సతులతో నవ్వులు చందమామగుటుకలు మతితలపోఁత లెండమావులనీళ్ళు రతులతో మాటలు రావిమానిపువ్వులు తతి విరహపుకాఁక తాటిమావినీడ | ॥ఇందు॥ |
| లలనల జవ్వనాలు లక్కపూసకపురులు నెలకొని సేసే బత్తి నీటిపై వ్రాత చెలువపు వినయాలు చేమకూరశైత్యాలు కొలఁదిలేని ననుపు గోడమీఁది సున్నము | ॥ఇందు॥ |
| పడఁతుల వేడుకలు పచ్చివడఁగండ్ల గుళ్లు కడుమోవితీపు చింతకాయకజ్జము బడి నలుమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుఁ- డడరించిన మాయలు అద్దములో నీడలు | ॥ఇందు॥ |


